క్షేత్ర స్థాయిలో పని చేసే కొందరు అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారు: చినరాజప్ప
- కొందరు అధికారులకు వైసీపీ వాసన పోలేదన్న చినరాజప్ప
- ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత డ్రగ్స్ మాఫియా గుట్టు బయటపడిందని వ్యాఖ్య
- వైసీపీ చెప్పే అసత్యాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్న టీడీపీ నేత
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొందరు అధికారులకు వైసీపీ వాసన పోవడం లేదని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కాగా పని చేస్తున్నప్పటికీ... క్షేత్ర స్థాయిలో పని చేసే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని చెప్పారు. ఇటీవల కొందరు అధికారులపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలే దీనికి నిదర్శనమని తెలిపారు.
విశాఖను వైసీపీ నేతలు డ్రగ్స్, గంజాయి హబ్ గా మార్చేశారని చినరాజప్ప దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ మాఫియా గుట్టు బయటపడిందని అన్నారు. డ్రగ్స్ వ్యవహారాన్ని కూడా తమపైకి నెట్టేసే ప్రయత్నాలను వైసీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పే అసత్యాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. పెద్దాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.