ఆ బస్సును పోలీసులు సీబీఐకి అప్పగించకుండా, సంధ్యా ఆక్వా కంపెనీకి ఎందుకు అప్పజెప్పారు?: పట్టాభి
- విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీపై ఆరోపణలు
- కొత్తమూలపేట సెజ్ లో గత మూడ్రోజులుగా నిలిపి ఉంచిన బస్సు
- బస్సులో తనిఖీలు చేసి, సంధ్యా ఆక్వా కంపెనీకి అప్పజెప్పిన పోలీసులు
- సీబీఐకి ఆధారాలు అందకుండా చేస్తున్నారన్న పట్టాభి
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, సంధ్యా ఆక్వా కంపెనీకి చెందిన బస్సు ఒకటి గత మూడ్రోజులుగా కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్ కాలనీలో నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఈ బస్సును తనిఖీ చేసిన పోలీసులు అందులో కంపెనీకి చెందిన పలు ఫైళ్లు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఆ బస్సును కంపెనీకి అప్పగించారు.
దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ బస్సును పోలీసులు సీబీఐకి అప్పగించకుండా, సంధ్యా ఆక్వా కంపెనీకి అప్పగించడం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు.
డ్రగ్స్ వ్యవహారంలో సీబీఐ తనిఖీలు చేస్తున్న విషయం సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసని, అందుకే కీలక హార్డ్ డిస్కులు, ఫైళ్లు బస్సులో ఉంచారని ఆరోపించారు. కానీ, వాటిని గుర్తించిన పోలీసులు సీబీఐకి అప్పగించకుండా, తిరిగి ఆ కంపెనీకి అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియాలని పట్టాభి స్పష్టం చేశారు.
సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.