శ్రీహరిలాంటి మంచోడిని నేను ఇండస్ట్రీలో చూడలేదు: శివాజీరాజా
- శ్రీహరి ఎంతోమందికి సాయం చేసేవాడన్న శివాజీరాజా
- తన పట్ల ఎంతో ఆత్మీయంగా ఉండేవాడని వ్యాఖ్య
- అప్పటికే చాలా చిక్కిపోయాడని వెల్లడి
- అభిమానమే శ్రీహరి సంపాదించుకున్నదని వివరణ
నటుడిగా శివాజీరాజా సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శ్రీహరిని గురించి ప్రస్తావించాడు. "శ్రీహరి సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి నాకు పరిచయం. ఆ తరువాత ఇద్దరం సినిమాల్లోకి వచ్చాము .. కలిసి పనిచేశాము. శ్రీహరిలాంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆపదలో .. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేయాలనే స్వభావం ఆయన సొంతం. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి ఆయన దగ్గర నుంచి డబ్బు పట్టుకుని వెళుతూ ఉండేవారు" అని చెప్పారు.
"శ్రీహరి చనిపోవడానికి ఒక వారం రోజుల ముందు కూడా నాకు కబురు చేస్తే వెళ్లాను. నన్ను చూడాలనిపించి కాల్ చేశానని అన్నాడు. నన్ను చూడగానే గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాము. అప్పటికే అతను చాలా చిక్కిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకే అతను చనిపోయాడు. అప్పుడు చూడటానికి నేను వెళ్లాను. అప్పుడు అక్కడ విపరీతమైన జనం ఉన్నారు .
శ్రీహరి చనిపోయినప్పుడు వచ్చినంతమంది జనాలను నేను ఇంతవరకూ చూడలేదు. ఆ స్థాయిలో ఆయనను చూడటానికి వచ్చారు. శ్రీహరి ఏం సంపాదించాడనేది చాలామందికి అప్పుడు అర్థమైంది. వందలకోట్లు సంపాదించినవారు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. కానీ తాను చేసిన సాయం వలన అంతమంది అభిమానులను సంపాదించుకోవడం ఒక్క శ్రీహరికే సాధ్యమైంది" అని చెప్పారు.