ఫస్టు సినిమాకే రేలంగికి కోపం తెప్పించిన రాజబాబు!
- నాటకాలంటే అన్నయ్యకి పిచ్చి అన్న చిట్టిబాబు
- తండ్రితో దెబ్బలు తినేవాడని వెల్లడి
- మిమిక్రీ కొంపముంచిందని వ్యాఖ్య
- అలా ఫస్టు ఛాన్స్ పోయిందని వివరణ
చిత్రపరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ ఎదిగిన హాస్యనటుడు రాజబాబు. మంచి నటుడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఆయనకి పేరుంది. రాజబాబును గురించి ఆయన తమ్ముడు చిట్టిబాబు తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "మా అన్నయ్య నాటకాలు ఆడేవాడు .. అది మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. ఆయన తిట్టడం .. కొట్టడం కూడా చేసేవాడు. అయినా నటన అంటే ఉన్న ఇష్టం కారణంగా అన్నయ్య మానుకునేవాడు కాదు. అలాంటి ఇష్టమే ఆయనను మద్రాసు తీసుకుని వెళ్లింది. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక సినిమాలో ఛాన్స్ సంపాదించుకున్నాడు.
ఫస్టు సినిమాలో అన్నయ్య ఫస్టు సీన్ రేలంగిగారి కాంబినేషన్లో పడింది .. అది కూడా సింగిల్ డైలాగ్. రేలంగి గారు లోపల వేరే సీన్లో ఉన్నారు. అన్నయ్య మేకప్ వేసుకుని బయట కూర్చున్నాడు. అక్కడ నాగభూషణం గారు .. సత్యనారాయణగారు ఉన్నారు. వాళ్లు అన్నయ్యను మిమిక్రీ చేయమని అడిగితే చేశాడు. రేలంగిగారిని ఇమిటేట్ చేయమని అంటే చేశాడు. అదే సమయంలో లోపలి నుంచి పిలుపు వచ్చింది. దాంతో అన్నయ్య లోపలికి పరిగెత్తుకు వెళ్లాడు.
అప్పటి వరకూ రేలంగిని ఇమిటేట్ చేసిన అన్నయ్య, లోపల కూడా తనకి ఇచ్చిన డైలాగ్ ను రేలంగి స్టైల్లో నే చెప్పాడు. అంతే రేలంగిగారికి చాలా కోపం వచ్చేసింది. 'పాండీబజార్ నుంచి తీసుకుని వచ్చారా .. పంపించండి బయటికి' అంటూ ఆయన అరిచాడు. ఎంతమంది చెప్పినా రేలంగిగారు వినిపించుకోలేదు. దాంతో ఆ సినిమాలో నుంచి రాజబాబుని తీసేశారు. ఫస్టు సినిమాకే ఇలా జరగడంతో రాజబాబు చాలా బాధపడ్డాడు" అని చెప్పారు.