ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో మాజీ కెప్టెన్ రోహిత్‌శర్మ వాగ్వివాదం.. వైరల్ వీడియో ఇదిగో!
- గుజరాత్ ఆటగాళ్లతో రోహిత్ మాట్లాడుతున్నప్పుడు ఘటన
- వెనక నుంచి వచ్చి రోహిత్‌ను హగ్ చేసుకున్న పాండ్యా
- వెంటనే వెనక్కి తిరిగి వాగ్వివాదానికి దిగిన మాజీ కెప్టెన్
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో మాజీ కెప్టెన్ రోహిత్‌శర్మ వాగ్వివాదానికి దిగాడు. గతరాత్రి నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో రోహిత్ మాట్లాడుతున్నప్పుడు పాండ్యా వెనకనుంచి వచ్చి రోహిత్‌ను హగ్ చేసుకున్నాడు. వెంటనే వెనక్కి తిరిగిన రోహిత్.. పాండ్యాతో సీరియస్‌గా మాట్లాడడం కనిపించింది. అదే సమయంలో రషీద్‌ఖాన్ తో ఆకాశ్ అంబానీ అక్కడే మాట్లాడుతున్నాడు. పాండ్యాతో రోహిత్ వాగ్వివాదానికి దిగడం చూసి వారు ఆశ్చర్యపోయారు.
గత సీజన్ వరకు ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మ నాలుగు ట్రోఫీలు అందించిపెట్టాడు. అయితే, గత సీజన్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన ముంబై దారుణ పరాభవాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. గతేడాది జరిగిన వేలంలో పాండ్యాను అనూహ్యంగా సొంతం చేసుకున్న ముంబై ఫ్రాంచైజీ అతడికి ఏకంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. గుజరాత్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు ‘రోహిత్ ఎప్పటికీ మా కెప్టెనే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మ్యాచ్‌లో గుజారాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.