నడిరోడ్డుపై రీల్స్ చేస్తుంటే గొలుసు లాగి పరారయ్యాడు.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
- నడుచుకుంటూ కెమెరా వైపు వస్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాగిన బైకర్
- ప్రతిఘటించే ప్రయత్నం చేయని మహిళ
- వీడియోలో కనిపిస్తున్న బైక్ నంబర్
- వైరల్ వీడియోపై భిన్నాభిప్రాయాలు
రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ మెడలోంచి ఓ చైన్ స్నాచర్ ఎంచక్కా గొలుసు దొంగిలించి పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. ఇటీవలి కాలంలో మహిళలు అవకాశం దొరికిన ప్రతిచోటా రీల్స్ చేస్తున్నారు. బస్టాండ్లు, పార్కులు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైళ్లు.. ఇలా రీల్స్‌కు ఏదీ అనర్హం కాదంటూ రీల్స్‌తో మోతెక్కించేస్తున్నారు.
ఘజియాబాద్‌లోని ఇంద్రాపూర్‌కు చెందిన సుష్మ నిన్న ఉదయం ఇంటి సమీపంలోని సర్వీస్ రోడ్డులో రీల్స్ చేస్తోంది. అందులో భాగంగా కెమెరావైపు చూస్తూ నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని గొలుసును లాక్కుపోయాడు. అతడు గొలుసు లాక్కెళ్తుంటే ఆమె కనీసం ప్రతిఘటించలేదు. రీల్ షూట్ చేస్తున్న వ్యక్తి కూడా దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిచోటా జరుగుతున్నాయని కొందరు కామెంట్ చేస్తే, రీల్స్ మోజులో పడి విలువైన వస్తువు పోగొట్టుకుందని మరొకరు రాసుకొచ్చారు. బైక్ నంబరు కనిపిస్తోంది కాబట్టి గొలుసు దొంగను పట్టుకోవడం పోలీసులకు పెద్ద పనేమీ కాదని మరికొందరు పేర్కొన్నారు. ఆ రీల్‌లో బైక్ దొంగ కూడా ఒక భాగం కావొచ్చని కొంతమంది అభిప్రాయపడ్డారు.