తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు

  • తెలంగాణలో మార్చి నాటికే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
  • మరో 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపిస్తుందన్న ఐఎండీ
  • జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని వెల్లడి
తెలంగాణలో మార్చి నెలలోనే భానుడి ప్రతాపం మొదలైంది. ఇప్పటికే ఎండవేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంకా ఎండలు ముదురుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) చెబుతోంది. 

రాగల ఐదు రోజుల్లో మరో 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది. ఉదయం పూట పొగ మంచు ఉన్నప్పటికీ, పగటి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. రాష్ట్రంలో ఎండలపై ఇప్పటికే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ పేర్కొంది.

తెలంగాణలో మార్చి నాటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ ను తాకడంతో, ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News