మ్యాట్రిమొనీలో పరిచయమైన మహిళకు రూ.2.71 కోట్లకు టోకరా వేసిన ఘరానా మోసగాడు

  • అమెరికా తీసుకెళతానని మహిళను మోసగించిన వైనం
  • పార్టనర్ వీసా కోసం సిబిల్ స్కోరు 850 ఉండాలని నమ్మబలికిన మోసగాడు
  • తమ కంపెనీ ద్వారా లోన్ ఇప్పిస్తానని మాయమాటలు
మ్యాట్రిమొనీలో తప్పుడు వివరాలు నమోదు చేసి మహిళలకు టోకరా వేసిన ఉదంతాలు గతంలో చాలా జరిగాయి. అవతలి వ్యక్తి ఎవరో నిర్ధారించుకోలేక, ప్రొఫైల్ లో కనిపించే వివరాలే నిజమని నమ్మిన అనేకమంది మహిళలు పలు విధాలా నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. 

తాజాగా, హైదరాబాదులో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. మ్యాట్రిమొనీలో పరిచయమైన మహిళకు ఓ ఘరానా మోసగాడు రూ.2.71 కోట్ల మేర టోకరా వేశాడు. అతడి పేరు శ్రీబాలవంశీకృష్ణ. మహిళతో పరిచయం పెంచుకుని అమెరికా తీసుకెళతానని మోసం చేశాడు. యూఎస్ పార్టనర్ వీసా కోసం సిబిల్ స్కోరు 850 ఉండాలని నమ్మబలికాడు. 

తమ కంపెనీ నుంచి లోన్ ఇప్పిస్తానని మహిళకు మాయమాటలు చెప్పి, ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేశాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ మహిళ తాను మోసపోయానని గుర్తించి లబోదిబోమంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.


More Telugu News