హోలీ పండుగకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హోలీ పండుగకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • రేపు (మార్చి 25) హోలీ పండుగ
  • హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన సర్కారు
  • మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సాధారణ సెలవు
రంగుల పండుగ హోలీ అంటే చెప్పేదేముంది... అన్ని వర్గాల వారికి ఇష్టమైన పండుగ హోలీ. హోలీ సందర్భంగా రేపు (మార్చి 25) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మార్చి 29న క్రైస్తవుల ముఖ్య పండుగల్లో ఒకటైన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సర్కారు సాధారణ సెలవు ప్రకటించింది. మార్చి 31న ఈస్టర్ పండుగ నిర్వహించనుండడం తెలిసిందే.


More Telugu News