ఐపీఎల్ లో సండే డబుల్ ధమాకా... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- జైపూర్ లో మ్యాచ్
- రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ లో నేడు సండే డబుల్ ధమాకాలో భాగంగా రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇక, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, హెట్మెయర్, కెప్టెన్ సంజు శాంసన్ వంటి హార్డ్ హిట్టర్లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.
పేస్ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, స్పిన్ లో రవిచంద్రన్ అశ్విన్, చహల్ లతో రాజస్థాన్ బౌలింగ్ వనరులు మెరుగ్గా ఉన్నాయి.
లక్నో జట్టు బ్యాటింగ్ ప్రధానంగా కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, నికోలాస్ పూరన్ ల ఫామ్ పై ఆధారపడి ఉంది. దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని వంటి దేశవాళీ ఆటగాళ్లు కూడా రాణించాలని లక్నో శిబిరం కోరుకుంటోంది.
అయితే, రాజస్థాన్ రాయల్స్ తో పోల్చితే లక్నో బౌలింగ్ ఏమంత ఆశాజనంగా కనిపించడంలేదు. రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీనుల్ హక్, మొహసిన్ ఖాన్, కృనాల్ పాండ్య లక్నో బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.