ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు... షెడ్యూల్ ఖరారు

  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు
  • తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు ప్రచారం
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. 

చంద్రబాబు 'ప్రజాగళం' పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 

ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

ఈ నెల 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేపడతారు. 

ఈ నెల 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 

ఈ నెల 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో... ఈ నెల 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

ఇక, రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.


More Telugu News