సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతోంది: లోకేశ్
- అయినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శ
- సీఎం నివాస పరిసరాల్లో నీటి ఎద్దడి
- బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్ కార్యక్రమంలో యువనేత వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్నా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ ఇంటి వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని లోకేశ్ ధ్వజమెత్తారు. ఆదివారం బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్ట్ మెంట్ వాసులతో ఆయన ముచ్చటించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అనే పదం కూడా వినిపించకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీపడేలా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని లోకేశ్ వివరించారు. విద్యాశాఖలో పలు సంస్కరణలు తీసుకొస్తామని, బోధనాపద్ధతులలో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని వివరించారు.