అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి దుర్మరణం

  • పెన్సిల్వేనియాలో మార్చి 21న ప్రమాదం
  • కారులో ప్రయాణిస్తున్న ఆర్షియా జోషీ దుర్మణం
  • ఘటనపై విచారం వ్యక్తం చేసిన భారతీయ రాయబార కార్యాలయం
  • యువతి మృతదేహాన్ని భారత్ తరలించేందుకు సాయపడతామని ట్వీట్
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై న్యూయార్క్‌లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆదివారం ట్వీట్ చేసింది. యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని పేర్కొంది. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆర్షియా జోషీ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.


More Telugu News