హైదరాబాద్‌లో ‘ఎర్త్ అవర్’.. గంటపాటు చీకట్లో ప్రజలు
- పర్యావరణంపై తమ నిబద్ధతను చాటుకున్న ప్రజలు
- స్వచ్ఛందంగా ‘ఎర్త్ అవర్’లో పాల్గొన్న వైనం
- గంటపాటు చీకట్లో సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, కేబుల్ బ్రిడ్జి, ప్రభుత్వ కార్యాలయాలు
శనివారం రాత్రి హైదరాబాద్ గంటపాటు చీకటిగా మారిపోయింది. ప్రముఖ ప్రదేశాలన్నీ ఆ సమయంలో చీకట్లోనే ఉండిపోయాయి. ప్రజలు కూడా గంటసేపు విద్యుత్తు వాడకాన్ని నిలిపివేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) పిలుపు మేరకు గత రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ప్రజలు స్వచ్ఛందంగా ‘ఎర్త్ అవర్’ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అత్యవసరం కాని విద్యుత్ వాడకాన్ని నిలిపివేసి ‘ఎర్త్ అవర్’కు మద్దతు తెలిపారు. ఇక, విద్యుత్ కాంతులతో ధగధగ మెరిసే సచివాలయం, అంబేద్కర్ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, చార్మినార్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎర్త్ అవర్ పాటించారు. పలు అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీల్లోనూ స్వచ్ఛందంగా దీనిని పాటించి పర్యావరణంపై తమ నిబద్ధతను చాటుకున్నారు.