విశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని కులాలకు ఆపాదిస్తున్నారు: వైసీపీపై విష్ణుకుమార్ రాజు ఫైర్
- మత్తు పదార్థాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న విష్ణు రాజు
- విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై అత్యున్నత విచారణ జరపాలని డిమాండ్
- కంటెయినర్ వద్దకు వెళ్లిన సీబీఐని అడ్డుకున్న ఘనత జగన్ దని మండిపాటు
మన దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు. మత్తు పదార్థాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆయన విమర్శించారు. గంజాయిని నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై అత్యున్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని వైసీపీ నేతలు కులాలకు ఆపాదిస్తున్నారని... ఇది సరికాదని అన్నారు. ఈ వ్యవహారంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరికి, ఆమె కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బీజేపీపై బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్ తో పట్టుబడిన కంటెయినర్ వద్దకు వెళ్లిన సీబీఐని అడ్డుకున్న ఘనత సీఎం జగన్ దేనని విష్ణు రాజు మండిపడ్డారు. 18 అవినీతి కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుపై కోడిగుడ్లు వేయించిన ఘనత వైసీపీదని విమర్శించారు. నాసిరకం మద్యం అమ్ముతూ మహిళల పుస్తెలను జగన్ తెంచుతున్నారని అన్నారు.