తిరుపతి దొంగ ఓట్ల వ్యూహం రాష్ట్రమంతా జరిగి ఉంటుంది: నిమ్మగడ్డ రమేశ్
- తిరుపతి ఉప ఎన్నికలో 35 వేల దొంగ ఓట్లను వైసీపీ వేయించిందన్న నిమ్మగడ్డ
- భారీ ఓట్లతో గెలిచామని వైసీపీ గొప్పలు చెప్పుకుందని విమర్శ
- పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ 35 వేల దొంగ ఓట్లు వేయించిందని అన్నారు. దొంగ ఓట్లతో గెలిచి, భారీ మెజార్టీతో గెలిచామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని దుయ్యబట్టారు. అయితే, దొంగ ఓట్లు చేర్చిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెప్పారు.
తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యూహ రచన.. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జరిగి ఉంటుందని... ప్రతి గ్రామంలో ఓటర్ ప్రొఫైల్ ను వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారని తెలిపారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని... ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని, వారిపై నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రధాని సభకు వెళ్లారనే అక్కసుతో మనిషిని చంపేయడం దారుణమని చెప్పారు.