తన చర్మం వలిచి తల్లికి చెప్పులు కుట్టించిన తనయుడు

  • మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఘటన
  • తల్లిపై అపారమైన ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్న రౌనక్ గుర్జర్
  • తల్లిదండ్రుల పాదాల చెంతనే స్వర్గం ఉంటుందని వెల్లడి  
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ అనే వ్యక్తి తన తల్లిపై ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నాడు. తన చర్మం వలిచి తల్లికి చెప్పులు కుట్టించాడు. ఓ మతపరమైన కార్యక్రమంలో ఆ చెప్పులను తల్లికి బహూకరించాడు. ఈ విషయంలో తనకు శ్రీరాముడే ఆదర్శం అని రౌనక్ గుర్జర్ వెల్లడించాడు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, "నేను నిత్యం రామాయణ పారాయణం చేస్తుంటాను. శ్రీరాముడి దివ్యగాథ నన్ను అమితంగా ప్రభావితం చేసింది. ఎవరైనా సరే తమ చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా సరే తల్లి రుణం తీర్చుకోలేనిదని రాముడు చెప్పిన మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే, నేను నా చర్మంతో చెప్పులు కుట్టించి మా అమ్మకు కానుకగా ఇవ్వాలని నిర్ణయిం" అని వివరించాడు. 

అంతేకాదు, తల్లిదండ్రుల పాదాల చెంతే స్వర్గం ఉంటుందని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నానని, తండ్రి ఆ స్వర్గానికి నిచ్చెన వంటి వాడైతే, తల్లి ఆ స్వర్గాన్ని సాకారం చేస్తుందని రౌనక్ గుర్జర్ వివరించాడు. ఇక ఈ కార్యం కోసం ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని, తన తొడ భాగం నుంచి చర్మాన్ని సేకరించాడు. ఆ తర్వాత ఓ చెప్పులు తయారుచేసే వ్యక్తిని కలుసుకుని, విషయం చెప్పి ఒప్పించి, పాదరక్షలను తయారుచేయించాడు. 


More Telugu News