ఈడీ అధికారులు అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు: మీడియాతో కవిత

  • కోర్టులోనికి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడిన కవిత
  • తన అరెస్ట్ అక్రమమని వ్యాఖ్య
  • ఈ అరెస్ట్‌పై పోరాడుతానన్న కవిత
  • ఇలాంటి అరెస్ట్‌లపై ఈసీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
ఈడీ అధికారులు తనను అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆమెను గత శుక్రవారం అరెస్ట్ చేసింది. శనివారం కోర్టులో హాజరుపరచడంతో వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈరోజుతో ఆమె కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెను మరో మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఆమె కోర్టులోకి వెళ్లడానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తన అరెస్ట్ అక్రమమని వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్ట్‌పై కోర్టులో పోరాడుతానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అరెస్ట్‌లు సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అరెస్ట్‌లపై ఈసీ దృష్టి సారించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారన్నారు.


More Telugu News