కొడుకు ఆర్యను చూడగానే భావోద్వేగానికి గురైన కవిత
- లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కవిత
- ప్రతి రోజు గంట సేపు కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతి
- ఈరోజుతో ముగియనున్న ఈడీ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు, ఆర్య, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. కస్టడీలో ఉన్న కవితను ప్రతి రోజు గంట సేపు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో కవితను కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. తన కొడుకు ఆర్యను చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని చూడగానే ఆర్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడని సమాచారం. కవితను న్యాయవాది మోహిత్ రావు కూడా కలిశారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, కోర్టులపై విశ్వాసం ఉంచుదామని కవితకు మోహిత్ రావు చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈరోజుతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కవితను ఈడీ అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. మరో వారం రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. కవితను మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా? లేదా? అనేది సాయంత్రం లోగా తేలిపోనుంది.