విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిద్దాం: జైభారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ

  • దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేయాలని పిలుపు
  • అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందన
  • భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలని లక్ష్మీ నారాయణ సూచన
విలువల ఆధారిత రాజకీయాలను ప్రోత్సహించాలని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. విప్లవ స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో ఉరితీసిందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ గొప్ప వీరులకు నివాళులు అర్పిద్దామని, వారి నుంచి స్ఫూర్తిని పొందుదామని లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘అందుకోండి వీరులారా.. జోహరులు’ అనే క్యాప్షన్‌తో ఒక ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోపై భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌ల ఫొటోలు ముద్రించి ఉన్నాయి.


More Telugu News