నుదుట సిందూరం ధరించడం వివాహిత బాధ్యత.. ఫ్యామిలీ కోర్టు తీర్పు
- మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్య
- భర్తగా తన హక్కులు పునరుద్ధరించాలంటూ వ్యక్తి పిటిషన్
- అతడు తనను వేధిస్తున్నాడన్న భార్య వాదనను కొట్టిపారేసిన కోర్టు
- తగిన ఆధారాలు సమర్పించలేదని వ్యాఖ్య, భర్త వద్దకు తిరిగెళ్లాలంటూ తీర్పు
సిందూరం ధరించడం వివాహితల మతపరమైన బాధ్యత అని మధ్యప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మహిళకు పెళ్లయిందనేందుకు సిందూరం చిహ్నమని వ్యాఖ్యానించింది. భార్య తనను వదిలివెళ్లిపోయిందంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఇండోర్ కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. మహిళ తక్షణం తన భర్త వద్దకు తిరిగెళ్లాలని ఆదేశించింది.
ఆ జంటకు సుమారు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. హిందూ వివాహచట్టం ప్రకారం తన హక్కులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాడు.
కాగా, మహిళ తన వాదనలు వినిపిస్తూ భర్త చేతిలో మానసిక, శారీరక వేధింపులకు గురయ్యానని చెప్పింది. అయితే, తన వాదనలు రుజువు చేసేందుకు మహిళ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. భర్త నుంచి విడిపోవాలనుకున్న మహిళ తనంతట తానుగా వెళ్లిపోయిందని అభిప్రాయపడింది. సిందూరం పెట్టుకోవట్లేదంటూ మహిళ చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. వెంటనే భర్త వద్దకు వెళ్లాలని ఆమెను ఆదేశించింది.