ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించండి: పార్టీ మారిన వారిపై చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ పిటిషన్
- మండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు
- బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వీరు... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న బీఆర్ఎస్
- వారి సభ్యత్వాలను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి
పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. శాసన మండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఆ పార్టీ శాసన సభా పక్షం శుక్రవారం ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు క్రమశిక్షణకు విరుద్ధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారి సభ్యత్వాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. వీరిరువురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెబుతూ వాటికి సంబంధించి ఆధారాలను జత చేశారు. మండలి చైర్మన్‌ను కలిసిన వారిలో షేరి సుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, యాదవరెడ్డి తదితరులు ఉన్నారు.