ఐపీఎల్-2024: ప్రారంభ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు
- నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ పోటీలు
- తొలి మ్యాచ్ లో సీఎస్కే × ఆర్సీబీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్-2024 సీజన్ కు తెర లేచింది. ఇవాళ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీకి సిద్ధమయ్యాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ ద్వారా చెన్నై జట్టు కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో తాజా సీజన్ ను ఆరంభిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు రచిన్ రవీంద్ర చెన్నై టీమ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. కివీస్ కు చెందిన మరో డాషింగ్ క్రికెటర్ డారిల్ మిచెల్ కూడా ఈసారి సీఎస్కే జట్టుకు ఆడుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజూర్ రెహ్మాన్, తుషార్ దేశ్ పాండే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.