కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ.. ఇండియా కూట‌మి కీల‌క నిర్ణ‌యం!

  • అర‌వింద్‌ కేజ్రీవాల్‌కు ఇండియా కూట‌మి మ‌ద్ద‌తు
  • ఈ అరెస్టుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ ఇండియా కూట‌మి 
  • ఎన్నిక‌ల వేళ ఢిల్లీ సీఎం అరెస్ట్ అప్ర‌జాస్వామికమ‌న్న కూట‌మి పార్టీలు 
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. కాగా, ఈడీ క‌స్ట‌డీలో ఉన్న కేజ్రీవాల్‌కు ఇండియా కూట‌మి పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఎన్నిక‌ల వేళ ఢిల్లీ సీఎం అరెస్ట్ అప్ర‌జాస్వామికం అని ఖండిస్తూ శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. అంతేగాక ఈ అరెస్టును వ్య‌తిరేకిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డానికి ఇండియా కూట‌మి సిద్ధ‌మైంది. 

ఇక లిక్క‌ర్ స్కామ్ కేసులో గురువారం ఈడీ అధికారులు మొద‌ట‌ సెర్చ్ వారెంట్‌తో సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. సుమారు రెండు గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అధికారులు ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే స‌మ‌యంలో కేజ్రీవాల్ మొబైల్‌ ఫోన్ కూడా సీజ్ చేశారు. అనంత‌రం ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. అప్ప‌టికే ఇంటి బ‌య‌ట భారీ మొత్తంలో కేంద్ర బ‌ల‌గాలు, పోలీసులను మొహ‌రించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీస్‌కు త‌ర‌లించారు.


More Telugu News