డ్రగ్స్ మోహన్ రెడ్డీ... డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: నారా లోకేశ్

  • విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ తో కంటైనర్ పట్టివేత
  • ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ నేతలు
  • డ్రగ్స్ ముఠాలను పెంచి పోషించవద్దంటూ జగన్ కు లోకేశ్ హితవు
విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ తో ఓ కంటైనర్ పట్టుబడడం తెలిసిందే. బ్రెజిల్ నుంచి హాంబర్గ్ మీదుగా ఇది భారత్ చేరుకుంది. అయితే, ఈ డ్రగ్స్ కంటైనర్ మీదంటే మీదని టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు వాడీవేడిగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. "డ్రగ్స్ మోహన్ రెడ్డీ... డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు... డ్రగ్స్, గంజాయి ముఠాలను పెంచి పోషించడం మానుకో" అని హితవు పలికారు. డ్రగ్స్ అంటే జగన్... జగన్ అంటే డ్రగ్స్ అని లోకేశ్ విమర్శించారు. 

మంగళగిరి 'పీఈపీఎల్' అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్ 

నారా లోకేశ్ ఇవాళ మంగళగిరి పీఈపీఎల్ అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్  విత్ లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే అడ్డుపడ్డాడని లోకేశ్ వారికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే ఏం చేస్తాడో, నియోజకవర్గ అభివృద్ధికి తన వద్ద ఉన్న ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో వారికి విడమర్చి చెప్పారు.


More Telugu News