ఏం చేయాలో ఇండియా కూటమి వెంటనే నిర్ణయించాలి: కేజ్రీవాల్ అరెస్ట్ పై కపిల్ సిబల్

  • కూటమి బలంగా ఉండాలని తాను ముందు నుంచి చెపుతూనే ఉన్నానన్న కపిల్ సిబల్
  • లిక్కర్ పాలసీ కేసు జీరో కేసు అని వ్యాఖ్య
  • అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల పైనే కేసు ఆధారపడి ఉందన్న సిబల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ఏం చేయాలనే దానిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వెంటనే ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. కూటమి బలంగా ఉండాలనే విషయాన్ని తాను ముందు నుంచి చెపుతూనే ఉన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. లిక్కర్ పాలసీ కేసు జీరో కేసు అని... అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల పైనే కేసు ఆధారపడి ఉందని అన్నారు. ఈ కేసులో ఆధారాలు లేవని, జరుగుతున్న తతంగం అంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు.


More Telugu News