నేడే ఐపీఎల్ తొలి సమరం.. చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌పై గెలుపు అంచనాలు ఇవే!
- రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి మ్యాచ్
- ఆర్సీబీపై చెన్నైకి మంచి ట్రాక్ రికార్డు.. ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్ జట్టు బరిలోకి
- స్పోర్ట్స్18 హెచ్‌డీ, జియో సినిమా వెబ్‌సైట్, యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
ఐపీఎల్ సందడి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ నేటి (శుక్రవారం) నుంచి షురూ కానుంది. తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఏకంగా రూ.17.50 కోట్లతో ముంబై నుంచి దక్కించుకున్న కామెరాన్ గ్రీన్‌పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. దీంతో నూతన సారధి రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలో ఆ జట్టు ముందుకు సాగనుంది. వన్డే వరల్డ్ కప్‌లో ఔరా అనిపించిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శార్దూల్ ఠాకూర్‌లు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నారు.
మ్యాచ్ వివరాలు ఇవే..
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అరగంట ముందు అంటే 7.30 గంటలకు టాస్ వేస్తారు. స్పోర్ట్స్18 హెచ్‌డీ, జియో సినిమా వెబ్‌సైట్, యాప్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
తుది జట్టు అంచనాలు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
గెలుపు ఎవరిదో?
ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో ఎవరు గెలవబోతున్నారనే ఆసక్తి మొదలైంది. గత రికార్డులను పరిశీలించగా ఈ రెండు జట్ల చివరి ఐదు మ్యాచుల్లో చెన్నై ఏకంగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఈ జట్ల మధ్య చివరిసారిగా జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై జట్టే గెలిచింది. ఆటగాళ్ల ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్సే ఫేవరెట్ జట్టు అనే అంచనాలు నెలకొన్నాయి. ఇక నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్‌లో రాణించవచ్చునని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. డుప్లెసిస్ గత 14 మ్యాచ్‌ల్లో 8 అర్ధసెంచరీలతో ఏకంగా 730 పరుగులు బాదాడు. చెన్నైపై అతడికి ఇంకా మంచి రికార్డు ఉంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లో బెస్ట్ బౌలర్‌గా నిలవొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2024లో చెన్నై జట్టుకు శార్దూల్ ఠాకూర్ ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. 2023 ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 13 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌లోనూ రాణిస్తాడనే అంచనాలున్నాయి.