రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న చంద్రబాబు
- పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న టీడీపీ అధినేత
- అనంతరం ఉండవల్లికి పయనం
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (మార్చి 22) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి నెల్లూరు బయల్దేరనున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం, ఉండవల్లి బయల్దేరనున్నారు.
టీడీపీ ఇంకా 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు.. ఆ లోపు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ లోక్ సభ స్థానంపై గీతం భరత్ ఆశలు పెట్టుకుని ఉండగా, ఇదే స్థానంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఎప్పట్నుంచో కన్నేశారు. ఇలాంటి అంశాలు పరిష్కారం అయ్యాకే రెండు పార్టీలు జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి.