ఓటమి తప్పదని జగన్ ఇష్టారీతిన అక్రమాలకు తెగించారు: దేవినేని ఉమా
- పాత కాంట్రాక్టర్లకే విద్యాకానుక కాంట్రాక్టు అంటూ మీడియాలో కథనాలు
- రూ.650 కోట్ల కాంట్రాక్టును అస్మదీయులకు అప్పగించారన్న ఉమా
- అడ్డగోలుగా రూ.వేల కోట్ల బిల్లులు విడుదల చేస్తున్నారని ఆరోపణ
ఏపీలో విద్యా కానుక కాంట్రాక్టును పాత కాంట్రాక్టర్లకు కట్టబెట్టారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. ఓటమి ఖాయమని తెలియడంతో జగన్ ఇష్టారీతిన అక్రమాలకు తెగబడ్డారని మండిపడ్డారు.
ఎలాంటి టెండర్లు పిలవకుండానే రూ.650 కోట్ల విద్యా కానుక కాంట్రాక్టును అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారని ఆరోపించారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా రూ.వేల కోట్ల బిల్లులు విడుదల చేస్తున్నారని ఉమా పేర్కొన్నారు.
ఫిపో నిబంధనలు పక్కనబెట్టి, తమకు నచ్చిన వారికి చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం మారుతుందనే భయంతో కమీషన్ల దందా భారీగా సాగుతోందని వివరించారు.