'వికసిత భారత్' వాట్సాప్ సందేశాలకు బ్రేకులు వేసిన ఎన్నికల సంఘం
- మార్చి 16 నుంచి దేశంలో ఎన్నికల కోడ్ అమలు
- ఫోన్లకు వికసిత భారత్ సందేశాలు వస్తున్నాయంటూ ఈసీకి ఫిర్యాదులు
- కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
ప్రధాని నరేంద్ర మోదీ అభిలషిస్తున్న 'వికసిత భారత్' ప్రచారానికి తాత్కాలిక అడ్డుకట్ట పడింది. దేశంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో వాట్సాప్ లో వికసిత భారత్ సందేశాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. సోషల్ మీడియాలో వికసిత భారత్ ప్రచారాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖకు నోటీసులు పంపింది.
కోడ్ అమల్లో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని స్పష్టం చేసింది. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ లో వికసిత భారత్ సందేశాలు వస్తున్నాయని ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈసీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.