పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్

  • బెర్‌హ‌మ్‌పోర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న పఠాన్
  • తనకు రాజకీయాలు భిన్నమైన పిచ్ అని... ఇక్కడా జట్టును గెలిపించడమే లక్ష్యమని వ్యాఖ్య
  • తృణమూల్ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటు అడుగుతామన్న యూసుఫ్ పఠాన్
మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని తాను పోటీ చేస్తోన్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హ‌మ్‌పోర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తనకు ఇక్కడ పెద్ద టీమ్ ఉందని, ఇది (రాజకీయాలు) తనకు భిన్నమైన పిచ్ అని, ఇక్కడ కూడా వేగంగా పరుగులు సాధించి... గెలిపించాలన్నదే తమ జట్టు లక్ష్యమని పార్టీని ఉద్దేశించి అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను తాము ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటు అడుగుతామని చెప్పారు.

2007 ప్రపంచ కప్‌లో ఆడిన‌ప్పుడు ఎంత సంతోషపడ్డానో... ఇప్పుడు కూడా అదే సంతోషం... అదే ఉత్సాహంతో ఉన్నానని యూసుఫ్ పఠాన్ పేర్కొన్నారు. గుజ‌రాత్ త‌న‌కు జ‌న్మ‌భూమి అని... బెంగాల్ క‌ర్మ‌భూమి అన్నారు. బెర్‌హ‌మ్‌పోర్ నుంచి గ‌తంలో అయిదుసార్లు కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం నుంచి ఆయ‌న పోటీ చేస్తారా? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.


More Telugu News