'రజాకార్' సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్... సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం

  • తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నిర్మాత గూడూరు నారాయణరెడ్డి ఫిర్యాదు
  • నిఘా వర్గాల ద్వారా దర్యాఫ్తు చేసి భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం
  • 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రతను కేటాయించిన ప్రభుత్వం
నిజాం హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనల ఆధారంగా చరిత్రకెక్కిన రజాకార్ సినిమా నిర్మాత గూడురు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు దాదాపు 1100 వరకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను కల్పించింది. 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లను భద్రత నిమిత్తం కేటాయించింది. నిఘా వర్గాల ద్వారా దర్యాఫ్తు చేసిన అనంతరం కేంద్రం భద్రతను కల్పించింది.

కాగా, గూడురు నారాయణ రెడ్డి నిర్మాతగా, యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకార్ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అప్పుడు విడుదల కాలేదు. ఇటీవల ఈ సినిమాను విడుదల చేశారు.


More Telugu News