నారా లోకేశ్‌కు విజయరేఖ లేదు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
- ధనదాహంతో గెలిచేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారన్న మంగళగిరి ఎమ్మెల్యే
- అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరికి పైసా పనిచేయలేదని ఆరోపణలు
- రాష్ట్రంలో టీడీపీని ఆశీర్వదించే పరిస్థితులు లేవన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. నారా లోకేశ్‌కు విజయరేఖ లేదని, కొన్ని కొన్ని రాతలు అంతేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి పదాన్ని స్పష్టంగా పలికి ఓట్లు అడగాలని అన్నారు. లోకేశ్ ధనదాహంతో మంగళగిరిలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఏపీని సింగపూర్ చేస్తానన్నారని, ఇప్పుడు లోకేశ్ మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానని చెబుతున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు.
తండ్రీ, కొడుకులు ఐదేళ్లు అధికారంలో ఉండి మంగళగిరికి పైసా పని చేయలేదని అన్నారు. మధ్యతరగతివారు, పేదలు, రైతులు అందరూ సంతోషంగా జీవించే మంగళగిరి కావాలని, వేల కోట్ల అధిపతులు మాత్రమే ఉండే గచ్చిబౌలిలు తమకు అవసరంలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి మంగళగిరిలో జరిగిన వైసీపీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.