నాలుగో రోజు ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ

  • ఆదివారం నుంచి విచారిస్తున్న ఈడీ అధికారులు
  • ఈరోజు పీఏలు రాజేశ్, రోహిత్ రావులను కూడా ప్రశ్నించిన ఈడీ
  • కవితను కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన కవిత న్యాయవాది మోహిత్ రావు
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు నాలుగో రోజు విచారించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసిన అధికారులు శనివారం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆదివారం నుంచి ఆమెను విచారిస్తున్నారు.

ఈరోజు కవితతో పాటు పీఏలు రాజేశ్, రోహిత్ రావులను కూడా ఈడీ అధికారులు విచారించారు. కవితను అరెస్ట్ చేసిన అనంతరం వారికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో వారు ఈ రోజు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇదిలా ఉండగా, కవితను కలవడానికి ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు వచ్చారు.


More Telugu News