తన సామాజికవర్గం వాళ్లు ఎక్కువమంది ఉన్నారని పవన్ పిఠాపురం వెళుతున్నారు... కానీ...!: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి
- పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
- తాను గెలిస్తే పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ
- పవన్ ను పిఠాపురం ప్రజలే ఓడిస్తారన్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానంపై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. తాను గెలిస్తే పిఠాపురంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఎక్కడా లేని అభివృద్ధిని పిఠాపురం తీసుకువస్తానని అన్నారు.
దీనిపై కాకినాడ అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ పిఠాపురం వెళ్లడం వెనుక పెద్ద ప్రణాళికే ఉందని అన్నారు. తన సామాజికవర్గం వాళ్లు పిఠాపురంలో ఎక్కువమంది ఉన్నారనే అక్కడ్నించి బరిలో దిగుతున్నారని, కానీ, వాళ్లే పవన్ కల్యాణ్ ను ఓడిస్తారని ద్వారంపూడి స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అన్నమాటే కానీ, ఆయన ఇతరుల నియంత్రణలో ఉన్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతి కావాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతించాలని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. ఇది పవన్ కల్యాణ్ ఖర్మ అనాలా? లేక రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనాలా? అని ఆయన వ్యాఖ్యానించారు.