గ్రీన్ జెర్సీలో మెరిసిన ఆర్‌సీబీ ఆటగాళ్లు
- చెన్నైలో జరిగిన ఫొటోషూట్‌లో గ్రీన్ జెర్సీని రివీల్ చేసిన ప్లేయర్లు
- ఫొటోషూట్‌లో పాల్గొన్న ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్
- 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతున్న ఆర్‌సీబీ
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) మంగళవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ అన్‌బాక్స్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్‌సీబీ మహిళ, పురుష జట్టు సభ్యులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమం ముగించుకుని ఆర్‌సీబీ ఆటగాళ్లు నేరుగా ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు.
ఈ నెల 22న చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్-2024 ప్రారంభ మ్యాచ్‌లో బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసమే ఆర్‌సీబీ ప్లేయర్లు చెన్నై చేరుకున్నారు. ఇక బుధవారం ఉదయం బెంగళూరు ఆటగాళ్లు చిన్న ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా వారు తమ గ్రీన్ జెర్సీని ధరించారు. ఆర్‌సీబీ 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతోంది. పర్యావరణ హితం కోరుతూ ఇలా బెంగళూరు ప్లేయర్లు ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో కనిపిస్తారు. తాజాగా ఐపీఎల్-17కు సంబంధించిన గ్రీన్ జెర్సీని జట్టు సభ్యులు ఈ ఫొటోషూట్‌లో రివీల్ చేశారు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్ ఇలా గ్రీన్ జెర్సీలో మెరిశారు.
ఇదిలాఉంటే.. ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని విషయం తెలిసిందే. తాజాగా ఆర్‌సీబీ మహిళలు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ టైటిల్ గెలవడంతో ఇప్పుడు పురుష జట్టుపై కూడా ఆర్‌సీబీ యాజమాన్యం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఫ్రాంచైజీతో పాటు ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక దాదాపు రెండు నెలల విరామం తర్వాత బ్యాట్ పడుతున్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ రాణిస్తే ఆర్‌సీబీకి తిరుగు ఉండదు. అలాగే విరాట్‌కు కూడా ఈసారి ఐపీఎల్‌లో రాణించడం చాలా కీలకం. ఎందుకంటే జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాలో చోటు కోసం కోహ్లీ ఈ టోర్నీలో చేసే ప్రదర్శన కీలకం కానుంది.
ఐపీఎల్-2024 కోసం ఆర్‌సీబీ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరూన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లూకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.