వాలంటీర్లు మా కార్యకర్తలు అని సీఎం జగన్ అనడం దారుణం: సీఎఫ్ డీ సభ్యుడు లక్ష్మణరెడ్డి
- ఏపీలో కోడ్ ఉల్లంఘన జరుగుతోందన్న సీఎఫ్ డీ సభ్యుడు లక్ష్మణరెడ్డి
- సీఎం జగన్ కు ప్రచార పిచ్చి ఎక్కువైందని విమర్శలు
- ప్రతిదానిపై సీఎం జగన్ ఫొటోలా? అంటూ లక్ష్మణరెడ్డి ఆశ్చర్యం
ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్ డీ) సభ్యుడు లక్ష్మణరెడ్డి ఆరోపించారు. వాలంటీర్లు మా కార్యకర్తలు అని సీఎం జగన్ అనడం దారుణమని విమర్శించారు. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి ఎక్కువైందని అన్నారు. సర్వే రాళ్లు, చిక్కీలు, ఆసుపత్రి ఓపీ ఫారాలపైనా జగన్ ఫొటోలా? అని లక్ష్మణరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీలు, అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
కాగా, రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. నిన్న ఒక్కరోజే 30 మంది వాలంటీర్లను అధికారులు డిస్మిస్ చేశారు. వీరు వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నట్టు గుర్తించారు.