సీపీఐ నారాయణకు అస్వస్థత.. బెడ్ రెస్ట్ సూచించిన వైద్యులు

  • ఇటీవల ఓ వేడుకలో జారిపడ్డ సీపీఐ నేత
  • రిబ్ ఎముక విరగడంతో ఆసుపత్రిలో చికిత్స
  • రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
సీపీఐ సీనియర్ నేత నారాయణ అస్వస్థతకు గురయ్యారు.. రిబ్ ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు రెండు వారాల విశ్రాంతి సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న కామారెడ్డిలో జరిగిన ఓ వివాహానికి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించేందుకు వేదిక మీదకు వెళుతుండగా జారిపడ్డారు. అప్పటికి పెద్దగా ఇబ్బంది కలగకపోవడంతో అశ్రద్ధ చేశారు.

అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స చేసి పంపిస్తూ.. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నారాయణ తెలిపారు.


More Telugu News