నాగార్జున అంటే ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టం: సీనియర్ హీరోయిన్ కస్తూరి
- 'భారతీయుడు'తో లభించిన గుర్తింపు
- ఆ సినిమాలో ఛాన్స్ వస్తుందని ఊహించలేదని వెల్లడి
- నాగార్జునను టచ్ చేసినందుకు పొంగిపోయానని వ్యాఖ్య
- 'అన్నమయ్య' చేయడం అదృష్టమని వివరణ
హీరోయిన్ కస్తూరి .. అనగానే అందరికీ కూడా ముందుగా గుర్తుకు వచ్చేది 'భారతీయుడు' సినిమా. 'ఐ డ్రీమ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి ఈ సినిమాను గురించి మాట్లాడారు. 'ప్రేమికుడు' సినిమా హిట్ అయినప్పుడు అందరూ డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండునని అనుకున్నాను. ఆయన 'భారతీయుడు' సినిమా నుంచి నాకు పిలుపు వస్తుందని నేను ఎంత మాత్రం ఆలోచన చేయలేదు" అన్నారు.
"శంకర్ దర్శకత్వం .. రెహ్మాన్ సంగీతం .. హీరోగా కమల్ హాసన్ . అలాంటి సినిమాలో అవకాశం వస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుందో, నాకు కూడా అలాగే అనిపించింది. కమల్ హాసన్ గురించి ఏం చెప్పమంటారు? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా చేసేటప్పటి కంటే, ఆ తరువాతనే నేను ఎంత అదృష్టవంతురాలిననే విషయం అర్థమైంది. ఇక తెలుగులో నేను 'అన్నమయ్య' వంటి ఒక సినిమా చేస్తానని కూడా ఎంతమాత్రం ఉహించలేదు" అని చెప్పారు.
" నేను స్కూల్లో చదువుకునే రోజుల నుంచి కూడా నాగార్జునగారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ రోజుల్లోనే నాగార్జునగారిని ఒకసారి కలిశాను. అప్పుడు ఆయన ఏ షర్టు వేసుకున్నదీ ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది. ఆయనకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన టచ్ చేసిన చేతితో నేను ఏమీ తాకకుండా స్కూల్ కి వెళ్లి మా ఫ్రెండ్స్ కి చూపించాను. నాగార్జునగారు టచ్ చేసిన చేయి అంటూ అంతా టచ్ చేసేవారు. నాగార్జునగారు అంటే ఇప్పటికీ నాకు అదే ఇష్టం ఉంది" అని చెప్పారు.