నారా లోకేశ్ కాన్వాయ్‌లో పోలీసుల తనిఖీలు
- తాడేపల్లి అపార్ట్‌మెంట్‌వాసులతో నాలుగు రోజులుగా ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమం
- ఈ ఉదయం తాడేపల్లికి వెళ్తుండగా కరకట్ట సమీపంలో అడ్డుకున్న పోలీసులు
- తనిఖీలకు సహకరించిన టీడీపీ యువనేత
- ఎన్నికల విధుల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నామని లోకేశ్‌కు చెప్పిన పోలీసులు
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు ఉండవల్లి కరకట్ట సమీపంలో లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీలు నిర్వహించారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న లోకేశ్ కాన్వాయ్‌లోని అన్ని కార్లను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే తనిఖీ చేస్తున్నట్టు లోకేశ్‌కు పోలీసులు తెలిపారు. దీంతో లోకేశ్ వారికి సహకరించారు. మొత్తం అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు లేకపోవడంతో కాన్వాయ్‌ని వదిలిపెట్టారు.
తాడేపల్లి అపార్ట్‌మెంట్ వాసులతో గత నాలుగు రోజులుగా లోకేశ్ రోజూ ఉదయాన్నే ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకో అపార్ట్‌మెంట్ సదుపాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.