తెలంగాణలో మరో 8 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు... అసంపూర్తిగా ముగిసిన భేటీ
- ఈరోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం
- పెండింగ్‌లో ఐదు లోక్ సభ స్థానాలు
- ఈ నెల 21న మరోసారి సమావేశం కానున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో ఎనిమిది లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఇది వరకే నలుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన సమావేశంలో మరో ఎనిమిది మందిని ఖరారు చేయడంతో మొత్తం 12 మంది అభ్యర్థులు ఖరారయినట్లు అయింది. అయితే మరో ఐదు స్థానాలను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. ఈ రోజు 8 రాష్ట్రాలకు సంబంధించి 50 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి ఎనిమిది మందిని ఖరారు చేశారు.
పలు రాష్ట్రాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఖరారుపై దాదాపు మూడు గంటల పాటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై అసంపూర్తిగా చర్చ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరికొన్ని సీట్లలో ఖరారుపై ఈ నెల 21న మరోసారి సమావేశం కానున్నారు. తదుపరి భేటీలో పెండింగ్ స్థానాల అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్నారు.
తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, అండమాన్ నికోబర్, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చ జరిగింది. అభ్యర్థులు, సీట్లపై చర్చ జరిగిందని... సీట్ల కేటాయింపు వివరాలను అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.