బ్రిటన్ మార్కెట్లో క్యాన్సర్ ఔషధాన్ని విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్

  • బెవాసిజుమాబ్ క్యాన్సర్ ఔషధాన్ని రూపొందించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్
  • వెర్సావో బ్రాండ్ నేమ్ తో పలు దేశాల్లో విక్రయం
  • 100 ఎంజీ, 400 ఎంజీ డోసుల్లో వెర్సావో వైల్స్ లభ్యం
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సరికొత్త క్యాన్సర్ ఔషధం బెవాసిజుమాబ్ ను బ్రిటన్ లో విడుదల చేస్తోంది. దీన్ని 'వెర్సావో' బ్రాండ్ పేరుతో యూకే మార్కెట్లోకి తీసుకువస్తున్నట్టు నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్ హెల్త్ కేర్ విభాగం ఆమోదం పొందిన తొలి బయోసిమిలర్ ఔషధం 'వెర్సావో'. 

మెటాస్టాటిక్ కొలోరెక్టల్ క్యాన్సర్, అడ్వాన్స్ డ్ నాన్ స్క్వామస్ నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, రికరెంట్ గ్లియోబ్లాస్టోమా, మెటాస్టాటిక్ రీనల్ సెల్ కార్సినోమా, అడ్వాన్స్ డ్ సెర్వికల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ తదితర అనేక రకాల క్యాన్సర్ల చికిత్సలో వెర్సావో ఉపయోగిస్తారని కంపెనీ వివరించింది. ఇది 100 ఎంజీ, 400 ఎంజీ సింగిల్ డోసుల్లో లభ్యమవుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వెల్లడించింది. 

'వెర్సావో' ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ సంస్థ భారత్ లో 2019లోనే విడుదల చేసింది. ఇదే బ్రాండ్ నేమ్ తో థాయ్ లాండ్, ఉక్రెయిన్, నేపాల్, జమైకా దేశాల్లోనూ దీన్ని విక్రయిస్తున్నారు. అయితే కొలంబియాలో మాత్రం ఈ ఔషధం 'పెర్సీవియా' పేరుతో మార్కెట్లో ఉంది.


More Telugu News