ఈడీ రిమాండ్‌ను రద్దు చేయండి: సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్
- కవిత తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది
- కవితను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాది
- ములాఖత్ సమయంలో కవితను కలిసి వెళ్లిన కేటీఆర్
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని... చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా... రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు.
పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని... ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత ఈడీ కస్టోడియల్ విచారణ నేడు మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు విచారించారు.
కవితను కలిసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సాయంత్రం తన సోదరి కవితను ఈడీ కార్యాలయంలో కలిశారు. ములాఖత్ సమయంలో సోదరితో మాట్లాడి వెళ్లిపోయారు.