బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ

  • కవితని శనివారం కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ
  • కస్టడీకి తీసుకున్న తర్వాత ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు
  • కవిత పిటిషన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ మద్యం కేసులో నాలుగు రోజుల క్రితం ఆమెను అరెస్ట్ చేసి... దేశ రాజధానికి తీసుకువెళ్లారు. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా... ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను కస్టడీకి తీసుకున్న తర్వాత ఈడీ అధికారులు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కవిత పిటిషన్‌కు కోర్టు అనుమతి

తన కొడుకు, తల్లిని చూసేందుకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కవితకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఎనిమిది మంది కలవడానికి కోర్టు అనుమతించింది. వారిలో తల్లి శోభ, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతించింది.


More Telugu News