భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • కీలక వడ్డీ రేట్లపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్న అమెరికా ఫెడ్
  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 736 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012కి పడిపోయింది. నిఫ్టీ 238 పాయింట్లు కోల్పోయి 21,817 వద్ద స్థిరపడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి. కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఈ వారంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.38%), కోటక్ బ్యాంక్ (0.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.26%), భారతి ఎయిర్ టెల్ (0.23%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.19%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-4.03%), నెస్లే ఇండియా (-3.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.15%), విప్రో (-3.05%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.62%).


More Telugu News