విజయసాయిరెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి నారాయణ
- గత ఐదేళ్లలో నెల్లూరుకు విజయసాయి ఏం చేశారని నారాయణ ప్రశ్న
- నెల్లూరు సొంతూరనే సంగతి ఇంత కాలం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా
- అసత్య ప్రచారాలను నమ్మే స్థితిలో నెల్లూరు ప్రజలు లేరని వ్యాఖ్య
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు సిటీలో సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో నారాయణ మాట్లాడుతూ... వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి గత ఐదేళ్లలో నెల్లూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. నెల్లూరు సొంతూరనే విషయం విజయసాయికి ఇంత కాలం గుర్తుకు రాలేదా? అని ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతలు చెప్పే కల్లబొల్లి మాటలు, చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని నారాయణ అన్నారు. టీడీపీ హయాంలో రూ. 5,263 కోట్లతో తాము చేసిన అభివృద్ధి నెల్లూరు ప్రజలకు కనిపిస్తుందని చెప్పారు. చివరి దశలో ఉన్న పలు పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. మున్సిపాలిటీపై భారమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.