వచ్చే ఐదేళ్లు నా పోరాటం మల్లారెడ్డిపైనే.. మైనంపల్లి షాకింగ్ కామెంట్స్
- లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదన్న కాంగ్రెస్ నేత
- తనను నియంత్రించేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌తో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారన్న మైనంపల్లి
- విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లానన్న హన్మంతరావు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన మైనంపల్లి హన్మంతరావు అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు.
వచ్చే ఐదేళ్లు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమాలపైనే తన పోరాటం ఉంటుందని తేల్చిచెప్పారు. తనను నియంత్రించేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌తో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకే ఇటీవల తాను మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కాలేజీలను కూల్చే వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. తమను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుని తృతీయ సంవత్సరంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న హన్మంతరావు వెంటనే కాలేజీకి చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు.