ఎక్కడి 3 కోట్లు .. ఎక్కడి 113 కోట్లు .. 'ప్రేమలు' ఓ హాట్ టాపిక్!
- ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన సినిమా
- తొలి ఆటతోనే అక్కడ లభించిన హిట్ టాక్
- ఈ నెల 8వ తేదీన తెలుగులో రిలీజైన మూవీ
- అత్యధిక వసూళ్లను రాబడుతున్న అనువాద చిత్రం
ఒకప్పుడు స్టార్ హీరోలు .. హీరోయిన్లు కలిసి చేసిన ప్రేమకథా చిత్రాలను తెలుగు ఆడియన్స్ ఆదరించారు. కానీ ఇప్పుడు ముదురు ప్రేమకథలను ఆదరించే పరిస్థితి లేదు. టీనేజ్ లవ్ స్టోరీస్ పట్ల మాత్రమే ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో అలాంటి ప్రేమకథా చిత్రాలు రాలేదు. కాలేజ్ సుడెంట్స్ ను గుంపులుగా థియేటర్స్ కి రప్పించే కంటెంట్ రాలేదు.
ఇలాంటి ఒక సమయంలోనే మలయాళం నుంచి తెలుగు అనువాదంగా 'ప్రేమలు' వచ్చింది. ఇది కామెడీ టచ్ ఉన్న టీనేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. మలయాళంలో ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా విడుదలైంది. నస్లెన్ - మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమాకి, గిరీశ్ దర్శకత్వం వహించాడు. నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నాడు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, తొలి ఆటతోనే మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా కోసం ఖర్చు చేసింది కేవలం 3 కోట్లు మాత్రమే. అలాంటి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అవలీలగా అడుగుపెట్టేసింది. 113 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ఈ సినిమా ఈ నెల 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇక్కడ ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ లేవు. అయినా మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. చాలా థియేటర్లలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన అనువాద చిత్రం ఇదేనని అంటున్నారు. అందుకే ఇప్పుడు అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు.