కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై క్లారిటీ వచ్చింది!
- ఇంగ్లండ్ తో సిరీస్ సందర్భంగా గాయంతో తప్పుకున్న కేఎల్ రాహుల్
- తరచుగా గాయాల బారిన పడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్
- కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ సాధించాడన్న జాతీయ క్రికెట్ అకాడమీ
గాయం కారణంగా ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్న టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై స్పష్టత వచ్చింది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే) నిర్ధారించింది.
కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఇటీవల కేఎల్ రాహుల్ తరచుగా గాయాల బారినపడుతున్నాడు. దాంతో అతడు ఐపీఎల్-2024లో ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు ఎన్సీయే నుంచి శుభవార్త అందింది. అయితే, ఇప్పట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోవడమే మంచిదని, కేవలం బ్యాట్స్ మన్ గా కొనసాగాలని ఎన్సీయే సూచించింది.
ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 24న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది.