మనవడు ఏకాగ్రహ్ కు అదిరిపోయే కానుక ఇచ్చిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

  • నారాయణమూర్తి తనయుడు రోహన్ మూర్తికి గతేడాది పుత్రోదయం
  • మనవడి పేరు మీద 15 లక్షల పేర్లు బదిలీ చేసిన నారాయణమూర్తి
  • ఆ షేర్ల విలువ రూ.240 కోట్లు ఉంటుందని అంచనా
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు ఇద్దరు సంతానం. వారు అక్షత మూర్తి, రోహన్ మూర్తి. అక్షత మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అన్న సంగతి తెలిసిందే. ఇక కుమారుడు రోహన్ మూర్తి 2019లో అపర్ణ కృష్ణన్ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడి పేరు ఏకాగ్రహ్. 

ఇక అసలు విషయానికొస్తే... నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రహ్ కు అదిరిపోయే కానుక ఇచ్చారు. తమ సంస్థలోని 15 లక్షల షేర్లను ఆయన మనవడి పేర బదిలీ చేశారు. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొన్నారు. 

మనవడు ఏకాగ్రహ్ కు నారాయణమూర్తి బదిలీ చేసిన షేర్ల విలువ రూ.240 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంతకీ ఏకాగ్రహ్ వయసు ఐదు నెలలే. గత నవంబరులో జన్మించాడు. నారాయణమూర్తికి ఇన్ఫోసిస్ లో 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 0.40 శాతం ఉంటుంది.


More Telugu News